పెద్ది “సరుకు సమాను” సెన్సార్ కట్ | Peddi Censor Review
Peddi Censor Review | Peddi Running Time
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నుండి పస్తున్న పాన్ ఇండియన్ మూవీ పెద్ది, ఈ మూవీ జూన్ 4న రిలీజ్ కాబోతుండగా నిన్ననే సెన్సార్ కంప్లీట్ చేసుకుంది, సెన్సార్ U/A సర్టిఫికేట్ పొందగా 189 నిమిషాల నిడివితో రిలీజ్ కాబోతుంది.

ఐతే ఈ సినిమా మొత్తం లో పెద్ది టీం కి కేవలం ఒక్క కట్ చెప్పారట, అది కూడా 100 మిలియన్ వ్యూస్ దాటినా చికిరి చికిరి సాంగ్ లో “సరుకు సమాను” పదం బదులు వేరే పదాన్ని వాడమని సూచిన్చారట, అంటే సినిమాలో చికిరి సాంగ్ లో “సరుకు సమాను” పదం బదులు వేరే పదాన్ని వినబోతున్నాము, ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ సమకూరుస్తున్నాడు, వృద్ది సినిమాస్ నిర్మిస్తుంది.